తెలంగాణ మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమీషనర్ రాణి కుముదిని

ఇంద్రధనుస్సు ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సంగ్రామానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సంసిద్ధం అయ్యింది. 27 జనవరి 2026 మంగళ వారం రోజు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ శ్రీమతి రాణి కుముదిని గారు తెలంగాణలోని 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రెస్ మీట్లో తెలిపారు. ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేశారు. జనవరి 28 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. చివరి తేది 30 జనవరి 2026. జనవరి 31 నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3, 2026 తేదీన పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. ఫిబ్రవరి 11 పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13 కౌంటింగ్ జరిపి విజేతలను ప్రకటిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నిమిత్తం అన్ని చర్యలు తీసుకున్నట్లు ప్రెస్ మీట్లో ఆమె తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *