
ఇంద్రధనుస్సు ప్రతినిధి: రానున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీరంగూడ డివిజన్ లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది? బీరంగూడ డివిజన్లోని అన్ని కాలనీల్లో సెటిలర్స్ ఓట్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్, బిజెపి పార్టీలు తమ అభ్యర్థులుగా బలమైన నాయకులను పోటీకి దించబోతున్నట్టు సమాచారం! ఇక్కడే ఒక కీలకమైన, ఆసక్తికరమైన గేమ్ నడవబోతుంది. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీలు స్థానిక నాయకులను పోటీకి నిలబెడితే, అధిక సంఖ్యలో ఉన్న సెటిలర్స్ ఓట్లు వారికి పడతాయా? అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనాకు అందడం లేదు. రాజకీయ పార్టీలు ఎంత ఖర్చు అయినా సరే ప్రతిష్టాత్మకమైన బీరంగూడ డివిజన్ దక్కించుకోవాలనే వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ తమ అభ్యర్థిగా జనరల్ వస్తే, అమీనుపూర్ మండల అధ్యక్షుడిని బరిలో నిలిపే అవకాశం ఉంది. బిఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పోటీ చేసే అవకాశం ఉంది. బిజెపి పార్టీ తరపున మాజీ కౌన్సిలర్ పోటీ చేసే అవకాశం ఉంది. మరి ఈ ముగ్గురిలో ఎవరికి సెటిలర్స్ ఓట్లు పడతాయి? అన్నది సందేహం! ఒక వేళ ప్రముఖ పార్టీలు తమ అభ్యర్థులుగా సెటిలర్స్ ను బరిలోకి దింపితే ఫలితం మరో విధంగా ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా సెటిలర్స్ ఓట్లు బీరంగూడ డివిజన్లో కీలకం కాబట్టి ఏ పార్టీ సెటిలర్స్ ను పోటీలో ఉంచుతుందో వారికి విజయం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారో వేచి చూద్దాం?