
శృంగేరి శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామీజీ వారి నుంచి ప్రశంసాపత్రం స్వీకరిస్తున్న శ్రీమతి రాణి ప్రభావతి

శ్రీ రాణి పార్వతీశం, శ్రీమతి రాణి ప్రభావతి దంపతులు
ఇంద్రధనుస్సు ప్రతినిధి: భగవద్గీత యొక్క ధార్మిక మరియు వేదాంతిక సందేశాన్ని ప్రచారం చేయడానికి శృంగేరి శ్రీ శారదా పీఠం వారు గీతాజ్ఞాన యజ్ఞ పథకాన్ని ప్రారంభించారు. జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు దక్షిణాదిన స్థాపించిన శృంగేరి శారదా పీఠం వారు నిర్వహించిన “భగవద్గీత” 18 అధ్యాయాల్లోని 700 శ్లోకాలు కంఠస్థం పోటీలో హైదరాబాద్, అమీనుపూర్ సర్కిల్, బీరంగూడ డివిజన్ పరిధిలోని వందనపురి కాలనీకి చెందిన శ్రీమతి రాణి ప్రభావతి గారు 25-1-2026 తేది రథ సప్తమి పండుగ రోజున పాల్గొని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత పొంది శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామీజీ వారి చేతుల మీదుగా రూ.21,000 నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం స్వీకరించారు. శ్రీమతి రాణి ప్రభావతి గారి ఆధ్యాత్మిక బాటలో ఈ విజయం మరో మకుటాయమానంగా నిలుస్తుంది. గతంలో కూడా మైసూరు శ్రీ దత్త పీఠం వారు నిర్వహించిన “భగవద్గీత” 700 శ్లోకాల కంఠస్థం పోటీల్లో మొదటి బహుమతి అందుకున్నారు. “భగవద్గీత” లోని శ్లోకాలు మానవ జీవితానికి ఎలా ఉపయోగపడతాయో ఆమె తెలియజేశారు. ప్రతి ఒక్కరు భగవద్గీతను చదివితే మనం ఎదుర్కొనే సమస్యలు పరిష్కారం అవుతాయని శ్రీమతి ప్రభావతి గారు తెలిపారు.