
▪️ అమీన్‌పూర్, బీరంగూడ డివిజన్లలో ప్రజల ఇబ్బందులను వివరించి – సిఎంసి కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించిన “కాటా శ్రీనివాస్ గౌడ్”
ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఈ రోజు సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని కలిసి 271-అమీన్‌పూర్ మరియు 270-బీరంగూడ డివిజన్ల పరిధిలోని పలు కాలనీలలో నెలకొన్న ప్రధాన సమస్యలను వివరించారు.
కాలనీలలో ముఖ్యంగా స్ట్రీట్ లైట్లు సక్రమంగా లేకపోవడం, డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతినడం, రహదారులు అధ్వానంగా మారడం వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.
ఈ ప్రధాన సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాల్సిందిగా కోరుతూ కమిషనర్ గారికి వినతిపత్రం అందజేశారు.