
ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు 18-1-2026 తేదీన జిఎంఆర్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన ముఖ్య నాయకులు/కార్యకర్తల సమావేశంలో చాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గూడెం మహిపాల్ రెడ్డికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే! ఎంతో ఒత్తిడికి లోనై కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి వెంట్రుక మందమైన మంచి జరగలేదంటూ వాపోయారు. నియోజకవర్గం ప్రజలు మూడు పర్యాయాలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. కన్నతల్లి లాంటి బిఆర్ఎస్ పార్టీని వీడి పొరపాటు చేసినట్లు అంగీకరించారు. అందుకే ముఖ్య నాయకులను, కార్యకర్తలను పిలిచి సమావేశం ఏర్పాటు చేసి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కనుక రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీలలో బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. వార్డు కౌన్సిలర్స్ గా పోటీ చేస్తున్న బిఆర్ఎస్ అభ్యర్థులకు తన సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో నియోజకవర్గం కో-ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారు బిఆర్ఎస్ అధిష్టానం వద్ద ఏదో ఒక విషయం తేల్చుకోవాలని భావిస్తున్నట్లు అనుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుందో వేచి చూద్దాం!