
ఇంద్రధనుస్సు ప్రతినిధి: సంక్రాంతి పండుగ సందర్భంగా 15-1-2026 తేది గురువారం సాయంత్రం హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరిగిన పల్లెటూరు సంక్రాంతి సంబరాల్లో ఇంద్రధనుస్సు మీడియా డైరెక్టర్ ఎస్. వెంకటేశ్వర రావు గారు ఇంద్రధనుస్సు యూట్యూబ్ ఛానెల్ మరియు indradhanussu.com వెబ్ ఛానెల్ ను AI టెక్నాలజీ ద్వారా ప్రారంభించారు. మన ఊర్లలో జరుపుకొనే సంక్రాంతి సంబరాలు నగరంలో ఎంతో ఆనందంగా జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని పలువురు తమ హర్షం వ్యక్తం చేశారు. ఇంద్రధనుస్సు ఛానెల్ సంక్రాంతి పండుగ రోజున ప్రారంభించటం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని, ఈ ఛానెల్ భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న అందరికీ ఆయన పండుగ శుభాకాంక్షలు తెలిపారు.