GHMC 300 డివిజన్లు, 60 సర్కిల్స్, 12 జోన్లతో దేశంలోనే అతి పెద్ద కార్పొరేషన్. ఫైనల్ నోటిఫికేషన్ గెజిట్ విడుదల

ఇంద్రధనుస్సు ప్రతినిధి: దేశంలోనే పెద్ద నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది. GHMC లో శివారున ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో హైదరాబాద్ నగరం 2053 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి దేశం పెద్ద నగరంగా రూపాంతరం చెందింది. 9-12-2025 తేదీన 300 డివిజన్లతో ప్రిలిమినరీ నోటిఫికేషన్ GHMC విడుదల చేసి సలహాలు, అభ్యంతరాలు తెలపటానికి పొడిగింపుతో కలిపి 10 రోజుల గడువు విధించింది. సుమారు 6000 కు పైగా సూచనలు, అభ్యంతరాలు రావటంతో కమీషనర్ ఆధ్వర్యంలో వివిధ కమిటీలు ప్రతి సూచనను, అభ్యంతరాన్ని పరిశీలించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా 300 డివిజన్లలో కొన్ని డివిజన్ల పేరు, సరిహద్దులు మార్పు చేసి ఫైనల్ నోటిఫికేషన్ గెజిట్ విడుదల చేసింది. గతంలో ఉన్న 6 జోన్లు 12 జోన్లుగా మార్పు చేసింది. గతంలో ఉన్న 30 సర్కిల్స్ ఇప్పుడు 60 సర్కిల్స్ ఏర్పాటు చేయబడినవి. పరిపాలన సౌలభ్యం కోసం 300 డివిజన్లు విభజించి 3 కార్పొరేషన్లు చేయబోతున్నట్లు సమాచారం.

GHMC 12 జోన్లు, 60 సర్కిల్స్, 300 డివిజన్లు వివరాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *