GHMC కమీషనర్ గారికి ధన్యవాదాలు!!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: GHMC డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300 వరకు పెంచినప్పుడు 9-12-2025 తేదీన ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చి అభ్యంతరాలు పంపటానికి వారం రోజులు గడువు ఇచ్చారు. బీరంగూడకు ఉన్న చారిత్రాత్మక ప్రాధాన్యతను తెలియజేస్తూ, బీరంగూడ డివిజన్ ఏర్పాటు చేయమని ఇంద్రధనుస్సు మీడియా ప్రజల ఆకాంక్షను గుర్తు చేస్తూ వినతి పత్రం శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో అందజేసింది. GHMC సూచనలు, అభ్యంతరాలు పరిశీలించి 25- 12-2025 తేదీన 300 డివిజన్లు ఫైనల్ నోటిఫికేషన్ ద్వారా గెజిట్ లో విడుదల చేసింది
అందులో 270 నెంబరు నందు “బీరంగూడ” పేరు ఇవ్వబడింది. చాలా సంతోషం. GHMC కమీషనర్ గారికి ఈ సందర్భంగా ఇంద్రధనుస్సు మీడియా డైరెక్టర్ ఎస్. వెంకటేశ్వర రావు గారు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *