పటాన్‌చెరు మండలంలోని నూతన సర్పంచులకు ఘన సన్మానం చేసిన కాటా దంపతులు

ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్‌చెరు నియోజకవర్గంలోని పటాన్‌చెరు మండలంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా క్యాసారం మరియు నందిగామ గ్రామాలలో విజయం సాధించిన సర్పంచులతో పాటు వార్డ్ సభ్యులను పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి శ్రీ కాట శ్రీనివాస్ గౌడ్ గారు మరియు సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాట సుధా శ్రీనివాస్ గౌడ్ గారు శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ పాలనలో బాధ్యత అత్యంత కీలకమని, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా సర్పంచులు పని చేయాలని వారు నూతనంగా ఎన్నికయిన వారికి సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి లబ్ధిదారునికి చేరవేయడంలో సర్పంచుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

అలాగే, కాంగ్రెస్ సర్పంచుల విజయం వెనుక పార్టీ నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషి ఉందని కొనియాడుతూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *