బ్రిటిష్ పాలకులకు యుద్ధం కోసం రూ.35,000 అప్పు ఇచ్చిన భారతీయుడు!

ఇంద్రధనుస్సు ప్రతినిధి:

1917 సంవత్సరం… ప్రపంచం మొత్తం యుద్ధ మంటల్లో కాలిపోతున్న కాలం.
ప్రపంచ యుద్ధం కారణంగా బ్రిటిష్ సామ్రాజ్యం ఆర్థికంగా కష్టాల్లో పడింది. అప్పుడు వారు ఒక నిర్ణయం తీసుకున్నారు…
భారతదేశంలోని ధనిక వ్యాపారుల నుంచి “వార్ లోన్” పేరుతో డబ్బు సేకరించాలని. అలాంటి సమయంలో మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ వ్యాపారి ముందుకు వచ్చారు. ఆయన పేరు — సేథ్ జుమ్మలాల్. ఆ కాలంలో 35 వేల రూపాయలు అంటే…అది చిన్న మొత్తం కాదు. ఇప్పటి విలువలో అది కోట్ల రూపాయలకు సమానం అని చెప్పవచ్చు.

బ్రిటిష్ అధికారుల అభ్యర్థనపై సేథ్ జుమ్మలాల్ 1917 జూన్ 4న ₹35,000ను అధికారికంగా అప్పుగా ఇచ్చారు. ఆ డబ్బు ఇచ్చినందుకు గుర్తుగా
బ్రిటిష్ అధికారులు ఒక సర్టిఫికేట్ కూడా జారీ చేశారు. ఆ పత్రంపై అధికారుల సంతకాలు, బ్రిటిష్ ముద్రలు ఉన్నాయి.

కానీ… కాలం గడిచింది.
1937లో సేథ్ జుమ్మలాల్ మరణించారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం భారత్‌ను వదిలి వెళ్లిపోయింది.

అయితే ఆ 35 వేల రూపాయల లోన్ ఏమైంది? తిరిగి చెల్లించారా? లేక చరిత్రలోనే మాయమైందా?

దాదాపు 100 సంవత్సరాల తర్వాత జుమ్మలాల్ కుటుంబ సభ్యులు పాత పత్రాలను పరిశీలిస్తుండగా ఆ వార్ లోన్ సర్టిఫికేట్ బయటపడింది.

ఇప్పుడు వారి వాదన ఏమిటంటే – బ్రిటిష్ ప్రభుత్వం ఆ అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి. ఈ కథ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో
మళ్లీ ఒక చారిత్రక చర్చ ప్రారంభమైంది. నిజంగా ఆ డబ్బు తిరిగి వస్తుందా? లేదా అది చరిత్రలో ఒక ఆసక్తికరమైన అధ్యాయంగానే మిగిలిపోతుందా?

ఇది కేవలం ఒక లోన్ కథ మాత్రమే కాదు… భారతదేశ చరిత్రలో దాగి ఉన్న ఒక ఆసక్తికరమైన ఆర్థిక సంఘటన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *