తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

ఇంద్రధనుస్సు ప్రతినిధి: ఫిబ్రవరి 11 తేదీన జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు కార్పొరేషన్లు, 66 మున్సిపాలిటీల్లో సత్తా చాటుకుంది. ఇతరుల మద్దతుతో మరో మూడు  కార్పొరేషన్లు, మరి కొన్ని మున్సిపాలిటీల్లో పాగా వేసే అవకాశం వుంది. బిఆర్ఎస్ పార్టీకి 13 ముసిపాలిటీల్లో ఆధిక్యం లభించింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక్కటి మాత్రం బిజెపికి దక్కే అవకాశం. మొత్తం మీద పట్టణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపే నిలబడ్డారని ఈ ఎన్నికల ద్వారా అర్థం అయింది.  37 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడి, పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారో తెలియని పరిస్థితి. మరో వైపు సంగారెడ్డి జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ విజయ ప్రభంజనం కొనసాగింది. పార్టీ మారిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా మున్సిపల్ ఎన్నికల్లో పటాన్ చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ కౌన్సిలర్స్ ను గెలిపించండని పిలుపు ఇవ్వడం క్లీన్ స్వీప్ కావడానికి దోహదపడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం 116 మున్సిపాలిటీల్లో 66 చోట్ల కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్ 13 దక్కించుకున్నాయి. బిజెపికి ఒక్క మున్సిపాలిటీ కూడా రాకపోవడం రాష్ట్ర అధినాయకత్వం మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇతరుల మద్దతుతో మరి కొన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 16 తేదీన జరిగే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీల్లో సత్తా చాటుతుందో పూర్తిగా తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *