గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తెలంగాణ ప్రభుత్వం!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 10న జీహెచ్‌ఎంసీ (GHMC) యొక్క ఐదు సంవత్సరాల పదవీకాలం సమయం ముగిసిన వెంటనే అధికారికంగా GHMC ను మూడు మునిసిపల్ కార్పొరేషన్లుగా పునఃవ్యవస్థీకరించింది —
1. Greater Hyderabad Municipal Corporation (GHMC), 2. Cyberabad Municipal Corporation (CMC), 3. Malkajgiri Municipal Corporation (MMC)
ఈ నిర్ణయం ఈ నగర పరిపాలనలో గతాల్లో జరిగిన అతిపెద్ద మార్పులలో ఒకటిగా భావిస్తున్నారు.
GHMC పరిధి గతంలో 650 చ.కి.మీ నుండి 2,053 చ.కి.మీకు విస్తరించి, 300 వార్డులు పరిధిలోకి పెరిగింది, ఇది భారతదేశంలో అతిపెద్ద కార్పొరేట్ వ్యవస్థగా మారింది.

పెద్ద పరిధి కలిగిన GHMCని మూడు కార్పొరేషన్లుగా విభజించడం ద్వారా పౌర సేవలు త్వరగా అందించడానికి, నియంత్రణ సులభతరం చేయడానికి ప్రక్రియను మరింత సమర్థవంతం చేయాలని ప్రభుత్వం భావించింది.
పునః వ్యవస్థీకరించిన తర్వాత కార్పొరేషన్ల వివరాలు:
1. GHMC
6 జోన్లు: Secunderabad, Charminar, Khairatabad, Rajendranagar, Golconda, Shamshabad
మొత్తం 150 వార్డులు/ డివిజన్లు; ఈ విభాగం పాత GHMC ప్రధాన కార్యాలయంలో నిర్వహించబడుతుంది.
2. Cyberabad Municipal Corporation (CMC)
3 జోన్లు: Serilingampally, Kukatpally, Quthbullapur
మొత్తం 76 వార్డులు/డివిజన్లు ; ప్రధానంగా ఐ.టి. మరియు మోడర్న్ వాణిజ్య ప్రాంతాలపై కేంద్రీకృతం.
3. Malkajgiri Municipal Corporation (MMC)
3 జోన్లు : Malkajgiri, Uppal, LB Nagar
మొత్తం 74 వార్డులు/ డివిజన్లు: వ్యసాయ మరియు నివాస అభివృద్ధి ప్రాంతాలపై కేంద్రీకృతం.
కమీషనర్లు & ప్రత్యేక ఆఫీసర్ నియామకం:
శ్రీ R.V. Karnan – GHMC కమీషనర్ గా కంటిన్యూ అవుతారు.
శ్రీమతి G Srijana – Cyberabad Municipal Corporation కమీషనర్ గా నియమితులయ్యారు.
శ్రీ T Vinay Krishna Reddy – Malkajgiri Municipal Corporation కమీషనర్ గా నియమితులయ్యారు.
శ్రీ Jayesh Ranjan – మూడు కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తారు, తదుపరి ఎన్నికలు జరిగేవరకు ఆయన మూడు కార్పొరేషన్లను పర్యవేక్షణ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *