
ఇంద్రధనుస్సు ప్రతినిధి: గాలికి తలుపు పడకుండా చిన్న పాకలో 60 ఏళ్ళు వాడిన రాయి, రత్నం అని ఆమెకు తెలియదు. జాతి రత్నమైనా, అది తెలియని చేతిలో ఉంటే మామూలు రాయి. తెలిసిన తరువాత దానిని కాపాడటం కష్టం. ప్రస్తుతం రొమేనియాలో బుజౌ మ్యూజియంలో ఉన్న ఓ రాయి అది రాయి కాదు. అత్యంత అరుదైన మేలైన జాతి రత్నం. ఈ జాతి రత్నాన్ని ఓ మహిళ తన ఇంట్లో తలుపు పడిపోకుండా అడ్డంగా పెట్టుకుని దాదాపు 60 ఏళ్ళు ఉండింది. మూడున్నర కిలోల బరువు ఉండే ఈ రత్నం ఆమె చనిపోయేంత వరకు కూడా తలుపు గాలికి పడకుండా ఉంచేందుకే వాడుకుంది. దాని విలువ ఆమెకే తెలియదు. ఆమె ఇంటికి వచ్చే వారికి తెలియదు. అందువల్ల దాదాపు 60 ఏళ్ల పాటు ఆ రాతిని తలుపుకు అడ్డం పెట్టేందుకే వాడుకుంది. గొర్రెలు మేపుకునేందుకు పోయి గ్రామం పక్కన ఏటిలో ఉంటే తెచ్చింది. ఇటీవల ఆమె చనిపోయిన తర్వాత వారి బంధువుల్లో ఒకరికి ఆ రాయి చూసి అనుమానం వచ్చింది. వెంటనే దాన్ని ప్రయోగశాలకు తీసుకెళ్ళి పరీక్షలు చేయిస్తే అది అత్యంత అరుదైన అద్భుతమైన రత్నం అని తేలింది. దాని వయసు కూడా 70 లక్షల సంవత్సరాల నాటి రత్నం అని కార్బన్ పరీక్షల్లో తేల్చారు. దీంతో ప్రభుత్వం దాన్ని సొంతం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వెంటనే ఆమె వారసులకు 11 కోట్ల రూపాయలు చెల్లించి ఆ రత్నాన్ని భుజో మ్యూజియంలో ఉంచింది. ప్రస్తుతం అది అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మ్యూజియంలో ఉంది. విలువ తెలిసిన తర్వాత దానికి భద్రతా సిబ్బంది కావలసి వచ్చారు. విలువ తెలియని రోజుల్లో ఆమె దానిని వాకిట్లో విసిరి పారేసింది.