
ఇంద్రధనుస్సు ప్రతినిధి: డివిజన్ల పరిధిలోని కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని మయూరి నగర్, శ్రీ సాయి నగర్ కాలనీలలో 61.50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన సిసి రోడ్ల పనులకు స్థానిక కార్పొరేటర్ పుష్ప నాగేష్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి పరిధిలోని మూడు డివిజన్ల పరిధిలో సిసి రోడ్లు, యుజిడిల నిర్మాణానికి ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయిస్తున్నాయని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఐలేష్ యాదవ్, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.