ఉస్కెబాయి బ్రిడ్జికి శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

అమీనుపూర్ మున్సిపల్ 13, 14 వార్డుల పరిధిలోని ఉస్కెబాయి వాగుపై 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఈ రోజు ఉదయం పటాన్ చెరు ఎమ్మెల్యే గౌ|| శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అమీనుపూర్ మున్సిపల్ ఛైర్మన్ శ్రీ తుమ్మల పాండురంగా రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీ నర్సింహ గౌడ్, 13 వార్డు కౌన్సిలర్ జి. లావణ్య శశిధర్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్, ఎ.ఇ, డి.ఇ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వందనపురి కాలని, భరత్ నగర్ కాలని, శ్రీ రాజరాజేశ్వరి కాలని, సృజనలక్ష్మినగర్ కాలని నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *