
అమీనుపూర్ మున్సిపల్ 13వ వార్డు పరిధిలోని మల్లారెడ్డి నగర్ కాలనీలో మరియు దివ్యశ్రీ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి అమీనుపూర్ మున్సిపల్ ఛైర్మన్ గౌ|| శ్రీ తుమ్మల పాండురంగారెడ్డి గారు, వైస్ చైర్మన్ నందారం నర్సింహ గౌడ్ గారు, మున్సిపల్ కమీషనర్ శ్రీమతి జ్యోతిరెడ్డి గారు, 13 వార్డు కౌన్సిలర్ జి. లావణ్య శశిధర్ రెడ్డి గారు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్, మల్లారెడ్డి నగర్ కాలనీవాసులు, దివ్యశ్రీ కాలనీవాసులు పాల్గొన్నారు. 13 వార్డులో సీసీ రోడ్ల శంఖుస్థాపన కొరకు వచ్చిన మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ కు, మున్సిపల్ కమీషనర్ గారికి 13 వ వార్డు కౌన్సిలర్ జి. లావణ్య శశిధర్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు.