
ఇంద్రధనుస్సు ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో.. పటాన్చెరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పటాన్చెరు నియోజకవర్గస్థాయి ప్రభుత్వ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ గారు హాజరై.. ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎస్పీ పంకజ్ గారు మాట్లాడుతూ..గత 25 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం గురుపూజోత్సవం పురస్కరించుకొని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను సన్మానించడం అభినందనీయమన్నారు.
నేటి బాలలే రేపటి పౌరులని.. అలాంటి బాలలని భావి పౌరులుగా తీర్చిదిద్దే మహోన్నత శక్తి ఉపాధ్యాయులకే ఉందని అన్నారు.
ప్రతి ఏటా ఉత్తమ ఉపాధ్యాయులను, ఉత్తమ విద్యార్థులను సన్మానించడం పట్ల ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఎస్పీ పంకజ్ గారు ప్రశంసించారు.
ప్రస్తుత సమాజంలో మత్తు పదార్థాల వినియోగం పెరుగుతోందని.. వాటిని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
పటాన్చెరు నియోజకవర్గంలో ప్రతి నెల సైబర్ క్రైమ్ లు పెరుగుతున్నాయని.. ప్రతి ఒక్కరూ వీటిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని విజ్ఞప్తి చేశారు.
మినీ ఇండియాగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక శాతం పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని.. వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
తాను ఎంపీపీగా ఉన్నప్పటినుండి నేటి వరకు నిరంతరాయంగా ప్రతి ఏటా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహిస్తూ. ఉపాధ్యాయులను సన్మానించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గము నుండి మూడుసార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించడంలో గురువుల పాత్ర గణనీయమన్నారు. నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న 100 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.