
ఇంద్రధనుస్సు ప్రతినిధి: మైసూరు దత్త పీఠం వారు నిర్వహించిన భగవద్గీత – 700 శ్లోకాలు కంఠస్థం పోటీలో గోల్డ్ మెడల్ సాధించిన శ్రీమతి రాణి ప్రభావతి గారిని అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు జి. శశిధర్ రెడ్డి గారు అభినందించి, శ్రీ ఆర్. పార్వతీశం, శ్రీమతి ప్రభావతి దంపతులను శాలువాతో సత్కరించి, వారు సాధించిన ఘనతను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్ రెడ్డి, మనోహర్, వెంకటేశ్వర రావు, లక్ష్మి నారాయణ యాదవ్, అప్పారావు, లాయర్ రవికుమార్, శ్రీధర్, వెంకట్ రెడ్డి, డి.ఎల్.వి. శ్రీనివాస్ దంపతులు, కె. బాలకృష్ణయ్య దంపతులు, శ్రీకాంత్ రెడ్డి, నాగేష్, చుక్కారెడ్డి, రామచంద్రారెడ్డి, ఫణి తదితరులు పాల్గొన్నారు.