
ఇంద్రధనుస్సు ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డు దారులకు ఉగాది పండుగ నుంచి సన్న బియ్యం పంపిణీ చేయాలని సంకల్పించడం ఎంతో సంతోషదాయకం! అందులో భాగంగా అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ, వందనపురి కాలని రేషన్ షాపుల్లో ఈ రోజు ఉదయం జరిగిన ఒక కార్యక్రమంలో అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి. శశిధర్ రెడ్డి గారు, బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఛైర్మన్ బి. సుధాకర్ యాదవ్ గారు మరియు అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ రమేష్ యాదవ్ గారి చేతుల మీదుగా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అందిస్తున్న ఈ పథకం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందిస్తున్నదని, సంక్షేమ కార్యక్రమాలు నియోజకవర్గం పరిధిలో ఖచ్చితంగా అమలు జరిగేలా చేస్తున్న పటాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీ కాటా శ్రీనివాస్ గౌడ్ గారి కృషి మరువలేనిదని ఈ కార్యక్రమానికి విచ్చేసిన నేతలు తమ ప్రసంగాల్లో తెలిపారు. ఈ కార్యక్రమంలో రేషన్ షాప్ డీలర్స్, రేషన్ కార్డు దారులు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.