
ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీన్పూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా గా ఐదు సంవత్సరాలు అవకాశం కల్పించిన ప్రజలకు నిరంతరం రుణపడి ఉంటానని అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ అన్నారు. శనివారం నాడు అమీన్పూర్ మున్సిపాలిటీ లో బాలాజీ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీవాసులు ఏర్పాటుచేసిన ఆత్మీయ అభినందన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా కాలనీవాసులు నరసింహ గౌడ్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నరసింహ గౌడ్ మాట్లాడుతూ కాలనీ ప్రజల మౌలిక వసతుల కోసం వారి సమస్యలే లక్ష్యంగా నిరంతరం పనిచేశానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో 11 వార్డ్ కౌన్సిలర్ ప్రమోద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మరియు బాలాజీ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు పలువురు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.