

ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీనుపూర్ మున్సిపాలిటీ 13 వార్డు పరిధి ఎస్.ఎల్.ఎన్.హోమ్స్ కాలనీలో జరిగిన హోళీ సంబరాల్లో అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి గారు పాల్గొన్నారు. కాలనీవాసులు అంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోళీ పండుగ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. హోళీ పండుగను పురస్కరించుకొని అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి. శశిధర్ రెడ్డి గారు అమీనుపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్నికాలనీల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నల్లూరి హైట్స్ లో జరిగిన హోళీ సంబరాలు అపార్ట్మెంట్స్ వాసులు ఆనందంగా జరుపుకున్నారు.