
ఇంద్రధనుస్సు ప్రతినిధి: బొంతపల్లి గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయం గ్రామస్థులకు భక్తి, శ్రద్ధ కేంద్రంగా ఉంది. ఆలయ అభివృద్ధి కోసం నూతన దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించింది.
ఈ కార్యక్రమానికి పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు, మరియు TGIIC చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను అభినందిస్తూ, ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని, భక్తుల సేవలో అంకితభావంతో పని చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులు:
చైర్మన్: మద్ది ప్రతాపరెడ్డి
డైరెక్టర్స్:
యాదగిరి గౌడ్
వీరస్వామి
పోతురాజు ఆశ
గడ్డం జంగారెడ్డి
ఎం. శ్రీనివాస్ గౌడ్
భజరంగ్ సింగ్
పొన్నబోయిన రాజు
పూజారి కృష్ణ
ఎం. వీర మల్లేష్
జి. కోటేశ్వర్ గౌడ్
బి. భాస్కర్ గౌడ్
యు. అశోక్ గౌడ్
ప్రధాన అర్చకులు: ఎం. శివలింగాలు
కాట శ్రీనివాస్ గౌడ్ గారు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారిని ఘనంగా సన్మానించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
అలాగే, భక్తుల సౌకర్యార్థం ఆలయంలో వసతి, నీటి సదుపాయాలు, ఇతర అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిటీకి సూచించారు. భక్తుల విశ్వాసానికి అర్హమైన విధంగా ఆలయ నిర్వహణ జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో TGIIC చైర్ పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ కంటెస్టెంట్ అభ్యర్థి నీలం మధు తదితరులు పాల్గొన్నారు.