
ఇంద్రధనుస్సు ప్రతినిధి: జిన్నారం మండలం జిన్నారం గ్రామంలోని శ్రీ శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ మహోత్సవంలో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ, “హిందూ సంప్రదాయాలలో దేవతా విగ్రహ ప్రతిష్ఠ ఎంతో పవిత్రమైన కార్యక్రమం. గ్రామంలోని భక్తుల నమ్మకానికి, సామూహిక శక్తికి ఇది ప్రతీక. గ్రామాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి” అని ఆకాంక్షించారు.