
ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్ చెరు నియోజవర్గానికి చెందిన 17 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన రూ. 8,85,500 విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు పంపిణి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాణపాయ స్థితిలో ఉన్న నిరుపేదల ప్రాణాలను కాపాడేందుకు తెలంగాణ సర్కార్ ఎంతగానో కృషి చేస్తుందని, ఆర్ధిక స్థోమత లేక వివిధ అనారోగ్యాలతో బాధ పడుతూ వైద్య సేవలకు డబ్బులు లేని నిరుపేదలకు సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కార్పొరేట్ వైద్యం అందించడంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు .