
ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీనుపూర్ మున్సిపాలిటీ 13 వార్డు పరిధిలోని మల్లారెడ్డి నగర్ కాలని, ఎస్.ఎల్.ఎన్. హోమ్స్ గణేష్ మండపంలో తేది. 9-2-2025 ఆదివారం రాత్రి 8 గంటలకు జరిగిన ఆత్మీయ సమావేశంలో కాలని వాస్తవ్యులు అమీనుపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జి. శశిధర్ రెడ్డి గారు, వారి సతీమణి 13 వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీమతి జి. లావణ్య దంపతులను ఎస్.ఎల్.ఎన్. హోమ్స్ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు ప్రశాంత్, జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ రాఘవేంద్ర, ట్రెజరర్ నాగయ్య, ఎగ్జిక్యూటివ్ సభ్యులు దీపక్, అభిషేక్, సత్యనారాయణ, సిద్ధ లింగ మరియు కాలనీవాసులు ఘనంగా సత్కరించారు. శ్రీ శశిధర్ రెడ్డి, శ్రీమతి లావణ్య దంపతులు వారి పదవీ కాలంలో 13 వార్డులో సిసి రోడ్లు, మంచి నీటి పైప్స్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వర్క్స్, తమ సొంత నిధులతో వార్డు పరిధిలో గణేష్ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించి 13 వార్డు ప్రజల అభిమానాన్ని పొందిన సందర్భంగా ఎస్.ఎల్.ఎన్. హోమ్స్ కాలనీవాసులు గెట్ టు గెదర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎల్.ఎన్. హోమ్స్ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ వారు శ్రీ శశిధర్ రెడ్డి దంపతులను ఘనంగా శాలువాలతో సత్కరించి “ఆత్మీయ సన్మాన పత్రం” ముద్రించిన జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమం ఒక పండుగలా సాగింది. అసోసియేషన్ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ, పటాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీ కాటా శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కాలనీవాసుల గెట్ టు గెదర్ కార్యక్రమంలో భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు.
ఎస్.ఎల్.ఎన్. హోమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ ఆతిథ్యానికి శ్రీ శశిధర్ రెడ్డి దంపతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.