
ఇంద్రధనుస్సు ప్రతినిధి: సంగారెడ్డిని మరో జవహర్‌నగర్‌గా మార్చాలన్న కుట్ర జరుగుతోంది. రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది పోలీసు బలగాలతో కలిసి నల్లవెల్లి భూములను కలుషితం చేస్తున్నారు. జవహర్‌నగర్ తరహాలోనే గుమ్మడిదల మండలంలోని, ప్యార నగర్‌లను డంపింగ్ యార్డులుగా మార్చేందుకు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తూ మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదెల్లి రవీందర్, ఎడ్ల రమేష్ మరియు బిజెపి సీనియర్ నాయకులతో పాటు అమీన్పూర్ బిజెపి మున్సిపాలిటీ అధ్యక్షులు బత్తినపాటి అనిల్ చారి గారు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.