
ఇంద్రధనుస్సు ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలలో కోటి రూపాయల విలువైన అభివృద్ధి పనులకు పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీనుపూర్ మున్సిపల్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. 8 లక్షల రూపాయల నిధులతో రెండు అంగన్వాడీ కేంద్రాలను రెనోవేట్ చేసిన కోకో కోల సంస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.