మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు – ఎమ్మెల్యే జిఎంఆర్

ఇంద్రధనుస్సు ప్రతినిధి: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్ చెరు పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశాన్ని ప్రగతి పథంలో నిలిపిన మహోన్నత నాయకుడు మన్మోహన్ సింగ్ అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *