
ఇంద్రధనుస్సు ప్రతినిధి: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కలాం గారికి నివాళులు అర్పించిన వారిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఎంపీలు రఘువీర్ గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గారు, పలువురు నేతలు ఉన్నారు.