
ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్ తన తండ్రి నందారం మల్లయ్య గౌడ్ జ్ఞాపకార్థం సొంత నిధులతో నిర్మించిన ముదిరాజ్ మహిళా భవనాన్ని మంగళవారం స్థానిక నాయకులతో కలిసి పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ప్రారంభించారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ముదిరాజుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ముదిరాజులకు సముచిత ప్రాధాన్యత అందిస్తున్నామని తెలిపారు. తండ్రి జ్ఞాపకార్థం భవనాన్ని నిర్మించడం పట్ల నరసింహ గౌడ్ ని ఆయన అభినందించారు.