

ఇంద్రధనుస్సు ప్రతినిధి:
▪️పటాన్చెరు నియోజకవర్గ నాయకుల అభిప్రాయాలు సేకరించిన ఏఐసీసీ, పీసీసీ అబ్జర్వర్లు :
కాట శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని ఎంపిక కార్యక్రమం అశోక్ నగర్ లోని సితార గ్రాండ్ హోటల్ లో నిర్వహించబడింది. సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశంలో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని (డీసీసీ) ఎంపిక ప్రక్రియ వేగం పుంజుకుంది. ఏఐసీసీ ఆదేశాల మేరకు, పీసీసీ సూచనల ప్రకారం అభిప్రాయ సేకరణ సమావేశాలు నిర్వహించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ… జిల్లాలో అందరికీ ఆమోదయోగ్యమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాలు చురుగ్గా సాగాయి.
ఈ కార్యక్రమాల్లో ఏఐసీసీ సెక్రటరీ సంగారెడ్డి జిల్లా అబ్జర్వర్ జరిత గారు,జుక్కల్ శాసనసభ్యులు లక్ష్మీకాంతారావు గారు నాయకులతో సమీక్ష జరిపారు.
కాట శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ– అభిప్రాయ సేకరణ డీసీసీ అధ్యక్షుని ఎంపికలో అందరికీ ఆమోదయోగ్యమైన, పార్టీ పట్ల నిబద్ధత కలిగిన, క్రమశిక్షణతో ఉన్న నాయకుడినే ఎంపిక చేస్తామని తెలిపారు.పార్టీ ఐక్యతను కాపాడుతూ, త్యాగం చేసిన, ప్రజలతో మమేకమైన నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కాంగ్రెస్ శక్తిని పునరుద్ధరించేందుకు సమన్వయంగా పని చేయాలని అబ్జర్వర్లు సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,మండల కాంగ్రెస్ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, ప్రతినిధులు పాల్గొన్నారు.