
ఇంద్రధనుస్సు ప్రతినిధి: బీరంగూడ నుండి కిష్టారెడ్డిపేట ఔటర్ రింగ్ రోడ్డు వరకు 68 కోట్ల రూపాయలతో చేపట్టిన 100 ఫీట్ల రహదారి విస్తరణలో భాగంగా మండే మార్కెట్ జంక్షన్, గ్రీన్ ఫీల్డ్ జంక్షన్, పటేల్ గూడ డబుల్ బెడ్ రూమ్ జంక్షన్లను ఒక కోటి 50 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
శుక్రవారం ఉదయం రెవెన్యూ, మున్సిపల్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్ మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి కూడళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బీరంగూడ – కిష్టారెడ్డిపేట రహదారి పరిధిలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా గత ప్రభుత్వ హయాంలో బీరంగూడ – కిష్టారెడ్డిపేట రహదారి విస్తరణ కోసం 68 కోట్ల రూపాయల కేటాయించి.. 100 ఫీట్ల రహదారిగా విస్తరించడం జరిగిందని తెలిపారు. రహదారి పరిధిలోని మండే మార్కెట్, గ్రీన్ ఫీల్డ్ జంక్షన్, పటేల్ గూడ డబుల్ బెడ్ రూమ్ జంక్షన్ల అభివృద్ధికి ఒక కోటి 50 లక్షల రూపాయల నిధులు కేటాయించినట్లు తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ జంక్షన్ లో శివాజీ విగ్రహం, పటేల్ గూడా డబుల్ బెడ్ రూమ్ జంక్షన్ లో మహాత్మా గాంధీ విగ్రహాలను సొంత నిధులతో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. త్వరలో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. సింఫనీ కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.