


ఇంద్రధనుస్సు ప్రతినిధి: విజయదశమి పండుగ సందర్భంగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఇంద్రధనుస్సు కార్యాలయంలో Ameenpur.Com yellow pages వెబ్ సైట్ ను ఇంద్రధనుస్సు మీడియా డైరెక్టర్ శ్రీ ఎస్. వెంకటేశ్వర రావు గారు ప్రారంభించారు. ఈ వెబ్ సైట్ లోని సమాచారం అమీనుపూర్, బీరంగూడ పరిసర కాలనీల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, Ameenpur.Com వెబ్ సైట్ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. దసరా పండుగ రోజున ధనుస్సుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, అలాంటి రోజునే ఇంద్రధనుస్సు మీడియా కొత్త లోగోను కూడా ఆయన ఆవిష్కరించారు.