
ఇంద్రధనుస్సు ప్రతినిధి: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు, గంగా జమున తెహజీబ్ సంస్కృతికి మొహర్రం ప్రతీక అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మొహర్రం పర్వదినం పురస్కరించుకొని జిఎంఆర్ యువసేన నాయకులు షకీల్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన షర్బత్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ..త్యాగ నిరతికి, సహనానికి ప్రతీక మొహర్రం. పీర్ల రూపంలోని అమరవీరుల సంస్మరణం.. అన్ని మతాల ఐక్యతకు సఖ్యతకు చిహ్నం మొహర్రం అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, అఫ్జల్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.