
ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్‌చెరు నియోజకవర్గంలోని అర్హులైన రైతులకు రైతు భరోసా నిధులు విజయవంతంగా జమ కావడాన్ని పురస్కరించుకుని, జిన్నారం గ్రామంలో రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీనివాస్ గౌడ్ – “రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యమని, ఇచ్చిన మాట ప్రకారం పటాన్‌చెరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా నిధులు అందించామని, కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే నిలబెట్టుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారికి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, KSG యువసేన సభ్యులు పాల్గొన్నారు.