
ఇంద్రధనుస్సు ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని చక్రపురి కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మున్సిపాలిటీలలో నిర్వహిస్తున్న వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వన మహోత్సవం – మొక్కలు నాటుదాం కార్యక్రమంలో భాగంగా పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు మొక్కలు నాటారు. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.