“వండర్ బీస్” ప్రీస్కూల్ కు ప్రారంభోత్సవం చేసిన అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు జి. శశిధర్ రెడ్డి

ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని వందనపురి కాలని రోడ్ నెంబర్ – 7 లో 11-6-2025 తేది బుధవారం రోజు ఉదయం 10-30 గంటలకు “వండర్ బీస్” ప్రీస్కూల్ ను అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు జి. శశిధర్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కూకట్ పల్లిలోని డి.ఎ.వి. స్కూల్ లో 15 సంవత్సరాల టీచింగ్ అనుభవం కలిగిన శ్రీమతి జి. సుజాత గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన “వండర్ బీస్” ప్రీస్కూల్ త్వరిత గతిన అభివృద్ధి చెందాలని శశిధర్ రెడ్డి గారు ఆకాంక్షించారు. ఎన్నో ఫ్రీ స్కూల్స్ ఉన్నప్పటికీ ఈ కాలని తమకు నచ్చి ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. వందనపురి కాలని చుట్టు ప్రక్కల ఉన్న కాలనీల పిల్లలకు ఈ స్కూల్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని స్కూల్ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి శశిధర్ రెడ్డి గారితో పాటు ఈశ్వర్ రెడ్డి, మనోహర్, వెంకటేశ్వర రావు, మల్లేష్, అప్పారావు, కృష్ణయాదవ్, శ్రీకాంత్ రెడ్డి, రంగరాజు, మాధవ్, రాము, మస్తాన్ నాయుడు, శ్రీధర్, మల్లారావు, రామచంద్రారెడ్డి, చుక్కారెడ్డి, ప్రవీణ్ మరియు ఫ్రీ స్కూల్ ఉపాధ్యాయులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *