
ఇంద్రధనుస్సు ప్రతినిధి: జూన్ 2 వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా “ఇంద్రధనుస్సు మీడియా” ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నది. ఎందరో అమర వీరుల త్యాగ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తున్నాము. ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మన తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలకాలని కోరుతూ….
-ఇంద్రధనుస్సు మీడియా