
ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్చెరు మండలం రుద్రారం గ్రామపంచాయతీ పరిధిలో సిఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం భూమి అంశంలో నష్టపోతున్న అసైన్మెంట్ భూమి లబ్ధిదారులకు ఎమ్మెల్యే జిఎంఆర్ అండగా నిలిచారు. రుద్రారం గ్రామంలో ఆధునిక వసతులతో పాఠశాల నిర్మాణం పూర్తయితే నిరుపేద విద్యార్థులకు కార్పోరేట్ విద్యను అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది లభిస్తుందని భావించి సంబంధిత భూమి లబ్ధిదారులతో ఇటీవల చర్చించి… పాఠశాల నిర్మాణానికి భూమి అందించేలా వారిని ఒప్పించారు. ఈ మేరకు గురువారం గ్రామ పరిధిలోని రుద్రారం గణేష్ గడ్డ దేవాలయం ఆవరణలో గ్రామ పుర ప్రముఖుల సమక్షంలో భూమి లబ్ధిదారులు జొన్నాడ మహేష్, జహంగీర్లకు 5 లక్షల రూపాయల చొప్పున..10 లక్షల రూపాయల సొంత నిధులు అందజేశారు. పాఠశాల నిర్మాణానికి భూమి ఇచ్చిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి అభినందించారు.