
ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన 9 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.4,16,500 విలువైన చెక్కులను పటాన్‌చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు ప్రభుత్వం అందించే సహాయం వారికి చేరేలా చేయడం ప్రజాప్రతినిధుల బాధ్యత” అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో మరిన్ని అర్హులైన దరఖాస్తుదారులకు సీఎంఆర్ఎఫ్ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. లబ్దిదారులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.