డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 134 జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు!!

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 134 జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు!!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలో అమీనుపూర్ పట్టణం మరియు బీరంగూడ శివాలయం చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి 134 జయంతి సందర్భంగా ఈ రోజు ఉదయం జరిగిన కార్యక్రమంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. పటాన్ చెరు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అమీనుపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి. శశిధర్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఛైర్మన్ బి. సుధాకర్ యాదవ్, అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మన్నె రవీందర్, సెక్రెటరీ రమేష్ యాదవ్, బీరంగూడ శివాలయం కమిటీ సభ్యులు లక్ష్మణ్, దీపక్ గౌడ్, మల్లేష్, ఆత్మ కమిటీ డైరెక్టర్ భిక్షపతి, శ్రీనివాస్, రాఘవేంద్ర కాలని శీను, బంధంకొమ్ము సత్తెన్న, ఈశ్వర్ రెడ్డి, అప్పారావు, బీరంగూడ సిద్ధు, ఇక్రిశాట్ కాలని మహేష్, మస్తాన్ నాయుడు, చుక్కా రెడ్డి, కృష్ణయాదవ్, రాములు, ఉమాశంకర్, గోపాల్ రెడ్డి, సుధాకర్, రాము మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *