మౌలిక వసతుల అభివృద్ధికి కృషి మెదక్ ఎంపీ రఘునందన్ రావు

మౌలిక వసతుల అభివృద్ధికి కృషి మెదక్ ఎంపీ రఘునందన్ రావు
సింఫోనీ కాలనీ కార్యాలయాన్ని ఎం ఎల్ ఏ తో కలిసి ప్రారంభించిన ఎంపీ

ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్ చెరు నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగనున్నట్లు మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. శనివారం సాయంత్రం పటాన్ చెరు లోని సింఫోనీ పార్క్ హోమ్స్ లో నూతనంగా నిర్మించిన అసోసియేషన్ భవనాన్ని స్థానిక ఎమ్మెలే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సింఫోనీలో వివాదంలో ఉన్న కమ్యూనిటీ స్థలాన్ని పరిరక్షించి అక్కడ క్లబ్ హోస్ తో పాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఎమ్మెల్యేతో కలిసి కృషి చేస్తానని పునరుద్ఘాటించారు. ఇప్పటికే బిల్డర్ తో పాటు మరికొంత మందిని పిలిచి చర్చించడం జరిగిందని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా వివాదం పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే అన్నిరకాల బలంగా ఉన్నాడని, లక్ష్మీపుత్రుడని పేర్కొంటూ ఆయనతో కలిసి సింఫోనీ సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి సహకరిస్థామని పునరుద్ఘటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం పీ పీ దేవానంద్, అమీన్పూర్ కౌన్సిలర్లు ఎడ్ల రమేష్, బోయిని బాలరాజ్, కాలనీ అధ్యక్షుడు పిల్లి వెంకట సత్తిరాజు, ప్రధాన కార్యదర్శి కుమార్, నాయకులు కాసాల సుధాకర్, లక్ష్మణ్ గుప్తా, రాము గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *