
ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్చెరు డివిజన్ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) కమిటీ నూతన చైర్మన్ మరియు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా TGIIC చైర్ పర్సన్ శ్రీమతి నిర్మల జగ్గారెడ్డి గారు, పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మరియు సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన చైర్మన్ ఎల్. శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు షేక్ ఫయాజ్, పి. మధుసూదన్ రెడ్డి, జి. సంజీవ, పీ. భిక్షపతి, కె. రాజు, పి. శ్రీనివాస్, పి. సత్యనారాయణ, బి. నర్సింలు, పి. నరేందర్ రెడ్డి, నాగేశ్వరరావు, వై. సుజాత, బి. సౌందర్య, కె. వసంత, పి. కవిత, ఎం. మునీర్, టి. శంకర్, పి. లక్ష్మారెడ్డి, ఎం. లక్ష్మి, పి. శ్రీనివాస్ రెడ్డి, కె. రేనమ్మ, బి. రోహిణి, మన్నె రవీందర్, బి. చంద్రకళ, ఎన్. శ్రీనివాస్ రెడ్డి తదితరులను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.