
ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని మల్లారెడ్డి నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అమీనుపూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు జి. శశిధర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నిన్న రాత్రి ఘనంగా జరిగాయి. 13, 15 వార్డుల పరిధిలోని చాలా కాలనీల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వివిధ కాలనీల ప్రతినిధులు శాలువాలతో శశిధర్ రెడ్డి గారిని సత్కరించి కేకులు కట్ చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వచ్చిన అతిథులందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేయటంతో మల్లారెడ్డి కాలనీలో ట్రాఫిక్ స్తంభించింది. బాణాసంచా వెలిగించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. జన్మదినం సందర్బంగా విచ్చేసిన అందరికీ శశిధర్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు.