వందనపురి రామాలయంలో మూడు రోజుల పాటు తొమ్మిదో వార్షిక బ్రహ్మోత్సవాలు!!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీనుపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో మార్చి 22 తేదీ నుంచి 24 వరకు తొమ్మిదో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆలయం నిర్మించి 9 సంవత్సరాలు పూర్తి అవుతున్న తరుణంలో జరుగుతున్నవార్షిక బ్రహ్మోత్సవాల్లో 22 వ తేదీన ధ్వజారోహణం, 23 వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణం, 24 వ తేదీన స్నపన తిరుమంజనం, పూర్ణాహుతి, అన్న ప్రసాద వితరణ, ద్వాదశ ప్రదక్షిణాలు, ధ్వజ అవరోహణం కార్యక్రమాలు జరుగుతాయి. కోరిన కోర్కెలు తీర్చే వందనపురి రాములవారిని బ్రహ్మోత్సవాల సమయంలో దర్శించుకొని స్వామి వారి ఆశీస్సులు తీసుకోండి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *