
ఇంద్రధనుస్సు ప్రతినిధి: తెలంగాణ పిసిసి అధ్యక్షుడి పిలుపు మేరకు, పటాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆదేశం మేరకు, అమీనుపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి. శశిధర్ రెడ్డి నేతృత్వంలో అమీనుపూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ శివాలయం చౌరస్తాలో ఈ రోజు ఉదయం 11 గంటలకు “అసెంబ్లీ స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను” అమీనుపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. దళిత స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. అగ్రకుల అహంకారంతో చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అమీనుపూర్ కాంగ్రెస్ మున్సిపల్ ప్రెసిడెంట్ శశిధర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మన్నె రవీందర్, బీరంగూడ భ్రమరాంబికా టెంపుల్ చైర్మన్ సుధాకర్, మాజీ ఎంపీటీసీ దేవదానం, మాజీ కౌన్సిలర్ మున్న, రమేష్ యాదవ్, సతీష్, మల్లేష్, సతీష్, ఈశ్వర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ రాజు, ప్రవీణ్, లక్ష్మణ్, చుక్కారెడ్డి, రామచంద్రారెడ్డి, భిక్షపతి, శ్రీను, అప్పారావు, మల్లారావు, మైపాల్ రెడ్డి, కె ఎస్ ఆర్ కృష్ణ, కృష్ణయాదవ్, మస్తాన్ నాయుడు, గిరి మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.