
ఇంద్రధనుస్సు ప్రతినిధి: తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వెలిమల గ్రామంలో గల శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పాల్గొని, దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పుర ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.