
ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్చెరు మండలం భానూరు గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ పవిత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర వేడుకలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి ఉత్సవాలు మన భక్తి, సంప్రదాయాలు, సామాజిక సమైక్యతకు ప్రతీక. గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ భక్తిశ్రద్ధలతో ఈ జాతరను ఘనంగా నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు.