నందారం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం!!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: మహిళలు సమానత్వం అనేది మన ఇంటి నుండి ప్రారంభం కావాలని ఇంట్లో మగ పిల్లలను ఆడపిల్లలను సమానంగా చూడాలని అమీన్పూర్ ఎస్సై సోమేశ్వరి అన్నారు. శనివారం నాడు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లికార్జున హిల్స్ కాలనీలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి శ్రీమతి యాదమ్మ, అమీన్పూర్ ఎస్సై సోమేశ్వరి,అడ్వకేట్ నీరజ, డాక్టర్ దీప్తితో పాటు నందారం లలిత, నందారం ఉమారాణి, నందారం సబిత మరియు పలువురు ముఖ్య అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కలిగి ఉండాలని విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని వారు కోరారు. ప్రధానంగా అమ్మాయిలు బాగా చదువుకోవడం వల్ల ఆ కుటుంబానికి వెలుగును ఇస్తుందని వారు అన్నారు. మగ పిల్లలను ఆడ పిల్లలను సమానంగా పెంచాలని బాల్యం నుంచే ఇంట్లో సమానత్వం పెంపొందించాలని మగ పిల్లలకు మహిళలను గౌరవించే విధంగా విలువలు నేర్పాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. కావున మహిళలందరూ బాగా ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని దానికి ప్రధానంగా ఈరోజు మహిళలు వారి కాళ్ళ మీద వాళ్లు నిలబడి ఒకవైపు కుటుంబ పోషణ పోషిస్తూ మరోవైపు సమాజంలో తమ బాధ్యతను నడిపిస్తూ ముందుకు వెళ్తున్నారని అన్నారు. మరొకసారి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *