పెండింగ్ ప్రాజెక్టుల గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇంద్రధనుస్సు ప్రతినిధి:

న్యూ ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెండింగ్ ప్రాజెక్టుల కోసం ఈ రోజు భేటీ అయ్యారు.
ప్రాజెక్టుల వివరాలు:

  1. హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-II కు రూ.24,269 కోట్ల అంచ‌నా వ్యయంతో 76.4 కి.మీ పొడ‌వైన ఐదు కారిడార్ల‌కు అనుమ‌తి ఇవ్వాలి.
  2. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయాలి. ద‌క్షిణ భాగం భూ సేక‌ర‌ణ‌కు అయ్యే వ్య‌యంలో 50 శాతం భ‌రించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం.
  3. ⁠మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్ట్ కు నిధులు ఇవ్వాలి. ఈసా, మూసా న‌దుల సంగ‌మంలో ఉన్న బాపూ ఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళ‌న‌కు 27 ఎస్టీపీల నిర్మాణం, మూసీ రిటైనింగ్ వాల్స్‌, క‌ర‌ క‌ట్ట‌ల నిర్మాణం, మూసీ గోదావ‌రి న‌దుల అను‌సంధానంతో క‌లిపి మొత్తంగా ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఆర్థిక సహాయం అంద‌జేయండి.. గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్ట్ కు 222.7 ఎక‌రాల ర‌క్ష‌ణ భూముల బ‌దిలీకి స‌హ‌క‌రించండి..
  4. ⁠రీజిన‌ల్ రింగ్ రైల్‌… డ్రైపోర్ట్‌లు మంజూరు చేయండి.
  5. ⁠ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రాజెక్టును హైదరాబాద్ లో ఏర్పాటు చేయండి. సెమీ కండ‌క్ట‌ర్ మిష‌న్‌కు అనుమ‌తించండి.
  6. సైబ‌ర్ నేరాలు, డ్ర‌గ్స్ కేసులు పెరగ‌డం, రాష్ట్రంలో పెరిగిన ప‌ట్ట‌ణాలు, ఇత‌ర అవ‌స‌రాల దృష్ట్యా తెలంగాణ‌కు అద‌నంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయండి.

ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ డి.శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *